ఐస్‌ మేక్‌ లాభాల్లో 184% వృద్థి

హైదరాబాద్‌ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ కంపెనీ లాభాలు 184.05 శాతం పెరిగి రూ.20.80 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది రూ.7.32 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.206.80 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 51.50 శాతం పెరిగి రూ.313.32 కోట్లకు చేరింది. 2023 మార్చి త్రైమాసికంలో 56.02 శాతం వృద్థితో రూ.8.63 కోట్ల లాభాలు ఆర్జించింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్‌పై రూ.1.80 డివిడెండ్‌ను చెల్లించడానికి ఆ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

Spread the love