అంబర్‌పేటలో స్కూల్ వ్యాన్‌ బీభత్సం…

నవతెలంగాణ – హైదరాబాద్‌ : నగరంలోని అంబర్‌పేటలో ఓ స్కూల్‌ వ్యాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం ఓ ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్‌ అదుపుతప్పి వెల్డింగ్‌ షాప్‌ టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. రెండు షాపుల్లోని సామగ్రి ధ్వంసమైంది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love