ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులుగా “శీమకుర్తి”


నవతెలంగాణ – అశ్వారావుపేట: మండల ఆర్యవైశ్య సంఘం అద్యక్షులుగా శీమకుర్తి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఆంధ్రజ్యోతి పత్రికలో సుదీర్ఘ కాలంగా ప్రాంతీయ ప్రతినిధిగా కొనసాగుతున్నారు. పట్టణ అధ్యక్ష పదవికి పోటీ నిర్వహించగా జల్లిపల్లి లోకనాథ్ గుప్తా గెలుపొందారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్య వైశ్యుల కుల సమావేశం మండల అధ్యక్షులు కొణిజర్ల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు.సమావేశం అనంతరం మండల, పట్టణ నూతన కమిటీల నియామకం పై చర్చించారు.మండల అధ్యక్షులుగా శీమకుర్తి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా పట్టణ అధ్యక్ష పదవికి పోటీ నెలకొంది. దీంతో ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించారు.ఇందులో వాసవి క్లబ్ మండల పూర్వ అధ్యక్షులు శీమకుర్తి సుబ్బారావు, జల్లిపల్లి లోక్ నాధ్ గుప్తా పోటీ పడగా సుబ్బారావుకు 55 ఓట్లు, లోక్ నాధ్ గుప్తాకు 112 ఓట్లు పోలైయ్యాయి. ఓట్ల లెక్కింపు అనంతరం లోక్ నాధ్ గుప్తా 57 ఓట్ల మెజారిటీతో గెలిపొందినట్టు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దారా మల్లిఖార్జునరావు ప్రకటించారు. ఎన్నికలను ఆర్యవైశ్య సంఘం జిల్లా పూర్వ అధ్యక్షులు, అశ్వారావుపేట పూర్వ సర్పంచ్ శీమకుర్తి వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్ మండల పూర్వ అద్యక్షులు కోరుకొండ రామ్మోహనరావు,చాంబర్ ఆఫ్ కామర్స్ మండల అధ్యక్షులు సంక ప్రసాద్ లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రెస్ క్లబ్ అద్రక్షులు తోకల హరీష్ గుప్తా, ముత్తా సుమాకర్, గుడివాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love