ఆల్ ఇండియా రాష్ట్ర జూనియర్ మహిళ కబడ్డీ జట్టుకు ఎంపిక

నవతెలంగాణ – హాలియా
హైదరాబాదులో జరగబోయే ఆల్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ పోటీలకు తెలంగాణ జట్టు తరఫున జూనియర్ భాగంలో నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట వార్డుకు చెందిన షేక్ ఆయేషా, నాదెండ్ల కీర్తి జూనియర్ జట్టుకు ఎంపికకావడం జరిగినది.షేక్ ఆయేషా తెలంగాణ రాష్ట్ర జూనియర్ మహిళ జట్టు కెప్టెన్ గా ఎన్నిక కావడం జరిగినది.ఇప్పటివరకు పలు అంతరాష్ట్ర క్రీడా పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరుస్తూ నల్గొండ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెస్తుంది ముందుు ముందు జరిగే  క్రీడలలో తెలంగాణ రాష్ట్ర జట్టు మొదటి బహుమతి సాధించడంలో తగిన సహా సహకారాలు జట్టుకు అందిస్తానని కోచ్ అన్వర్ ఖాన్ తెలిపారు.
Spread the love