అండర్ 19 కబడ్డీ జట్టుకు ఎంపిక

నవతెలంగాణ – హలియా
తెలంగాణ రాష్ట్ర అండర్ 19 కబడ్డీ జట్టుకు  పెద్దవూర మండలం కేకే తండకు  చెందిన ఆర్. సంపత్ ఎన్నికయ్యారు. ఈ నెల 24నుండి 28 వరకు కర్ణాటక రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. సంపత్ ఎస్ ఆర్  జూనియర్ కళాశాల నల్గొండ నందు ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సంపత్ ఎంపిక కావటంతో కోచ్ ఆవుల చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశాడు.
Spread the love