Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయండి : మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి

తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయండి : మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – చౌటకూర్ : ఇండ్ల వద్దనే తడి, పొడి చెత్తను వేరుచేసి చిత్త వాహనంలో వేయాలని సుభాష్ రెడ్డి తెలిపారు.మండల కేంద్రంమైన చౌటకూర్ గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త బుట్టలను గ్రామ సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి మాజీ ఎంపీపీ భూంరెడ్డి సుభాష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డిలతో కలిసి గ్రామస్తులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేయవద్దని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రామ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వర్కల రమేష్, వార్డు మెంబర్లు బాలరాజు, పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున గౌడ్, అనురాధ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -