Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇకపై ఎరువులన్నీ ఒకే యాప్ లో

ఇకపై ఎరువులన్నీ ఒకే యాప్ లో

- Advertisement -

ఈనెల 20 నుంచి అమలుకు శ్రీకారం
నవతెలంగాణ – మల్హర్ రావు

పంటలు పండించే రైతులకు ఎరువుల కష్టాలు తీర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏడాది నుంచి యాప్ విధానం ప్రవేశపెట్టింది. యాప్ ద్వారా ఒక్క యూరియా తీసుకునే రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం మరో దుకాణానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒకేయాప్ ద్వారా యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది.

ఎరువుల కొరత లేకుండా..
ఈవానాకాలం సీజన్లో ఈసారి మండల వ్యాప్తంగా వరి, పత్తి పంటలే అత్యధికంగా సాగు చేస్తున్నారు. 15300 ఎకరాల్లో వరి, 3600 వేల ఎకరాల్లో పత్తి, 2400 ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. పంటలకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచారు. సాగుచేసిన పంటలకు సుమారు 4 వేల మెట్రిక్ యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు వెయ్యి మెట్రిక్ టన్నులు రాగా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే 500 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం ఉంటుందని చెబుతున్నారు.

పట్టా లేని రైతులకు కష్టాలేనా?
మండలంలో అనేకమంది రైతులు తమ భూములను పట్టాలు లేకున్నా సాగు చేస్తున్నారు. నిన్నామొన్నటి వరకు యూరియా కోసం ఇబ్బంది పడ్డ రైతులు ఇకముందు కాంప్లెక్స్ ఎరువుల కోసం కష్టాలు తప్పవా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టాదారు పాసుపుస్తకం ఉండి పార్మర్ రిజిస్త్రీ చేసుకున్నవారికే యాప్ ద్వారా యూరియా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్టా లేని రైతులకు ఎరువులు ఎట్లా.? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతులపై భారం తగ్గించేలా..
యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువుల భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాప్ ద్వారా యూరియా అందిస్తున్న ప్రభుత్వం అదే యాప్ ద్వారా కాంప్లెక్స్ ఎరువులు అందించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, డీఏపీ లాంటి ఎరువులు రైతులకు అదనపు భారం అవుతున్నాయి. ఫెర్టిలైజర్ దుకాణాల్లో డీఏపీ కొనుగోలుకు యజమానులు కొర్రీలు పెడుతున్న క్రమంలో యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

20 నుంచి అమలు
యాప్ ద్వారా అన్నిరకాల ఎరువులను రైతులకు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల 20 నుంచి మండలంలో యాప్ ద్వారా పంపిణీ చేస్తామని కొరత లేకుండా, రైతులపై భారం పడ కుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందకుండా యాప్ ద్వారా ఎరువులు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -