వృద్ధురాలిపై లైంగిక దాడి..

– మంటకలిసిన మానవత్వం
నవతెలంగాణ-  చందుర్తి
ఓ వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగిన ఫటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన( 70 ) సంవత్సరాల వృద్ధురాలు ఇంటి వద్ద ఉండగా ఇంట్లో ఎవరు లేని సమయం ఆమె వద్దకు అదే గ్రామానికి చెందిన అవునూరి తిరుపతి అనే వ్యక్తి వచ్చి మాయ మాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై ఓ నిర్మానుష్య చోటు కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు దీంతో వృద్దు రాలు కేకలు వేసి జరిగిన విషయాన్ని స్థానికులకు తెలుపగా పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు వచ్చి నిందితున్ని పట్టుకొని స్టేషన్ కు తరలించి బాధితురాలి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love