జనవరి 12న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల నెహ్రూ పార్కు వద్ద గల దుకాణ సముదాయాలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాస్ పండు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ నగరంలో మాస్ ఫండ్ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఈ చలో ఢిల్లీ కార్యక్రమ డిమాండ్స్ విద్యార్థులలో ఆశాస్త్రీయ విధానాలను పెంపొందించే విధంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, యూనివర్సిటీలలో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా పకడ్బందీ చట్టాలు రూపొందించాలని, అలాగే మహిళా రక్షణ కొరకు కఠిన చట్టాలను రూపొందించి అమలు చేసే రకంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు విశాల్ నగర్ ఉపాధ్యక్షులు దీపిక గణేష్ సందీప్ నగర నాయకులు బాబురావు వరదరాజ్ సజన్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.