Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్‌ఎఫ్‌ఐ విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

ఎస్‌ఎఫ్‌ఐ విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం పరకాల పట్టణంలో విద్యార్థి సంఘం (ఎస్‌ఎఫ్‌ఐ) చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాయి. బంద్‌లో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, ఇస్మాయిల్, పట్టణ కార్యదర్శి సాయి తేజ, విక్కీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -