శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఎలాంటి పర్మిషన్ లేకుండా జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థల పేరుతో అడ్మిషన్లు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ నారాయణరెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియ రాజు లు మాట్లాడుతూ.. జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థల పేరుతో జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల కొరకు బస్సులను తిప్పుతూ అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి, పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు, ఈ విద్యాసంస్థలు అమాయక తల్లిదండ్రులను మోసం చేసి లక్షలాది ఫీజులు వేసుకొని మోసం చేయాలని చూస్తున్న , విద్యాసంస్థలకు అనుమతి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని పర్మిషన్ లేకుండా శ్రీ విద్యాసంస్థలు అడ్మిషన్ల కోసం గ్రామాలకు బస్సులను తిప్పుతున్నారనీ ఆరోపించారు.  ఈ విద్యా సంస్థలకు అడ్మిషన్ ఇవ్వకుండా వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ విద్యాసంస్థలను  మూసివేయాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.  ఇప్పటికే జిల్లాలోని భువనగిరి, మోత్కూరు, వలిగొండ ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగిందనీ  లేనియెడల ఈ విద్యాసంస్థలకు పర్మిషన్ పర్మిషన్ ఇస్తే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను సేకరించి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. డిఈ ఓ స్పందిస్తూ విచారణ జరిపి, చర్యలు తీసుకోనున్నట్లు  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వేముల నాగరాజు ఈర్ల రాహుల్ భవాని శంకర్ లు పాల్గొన్నారు.
Spread the love