ఆలయాన్ని పర్యటక కేంద్రంగా మారుస్తా: షబ్బీర్ అలీ

నవతెలంగాణ – భిక్కనూర్
మండల కేంద్రంలో ఉన్న దక్షిణ కాశి శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయాన్ని పర్యటక కేంద్రంగా మారుస్తానని, ఆలయంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. గురువారం సిద్ధ రామేశ్వర ఆలయంలో భిక్కనూర్ పట్టణానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాస్తు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాస్తు హోమా పూజా కార్యక్రమాలు చేపడుతున్న ఉడిపి పూజారులు వాస్తు నివారణ, ఆలయ అభివృద్ధి పనుల గురించి షబ్బీర్ అలీకి వివరించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆలయ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సిద్ధ రామేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు హోమా కార్యక్రమానికి విచ్చేస్తున్న షబ్బీర్ అలీ కి హైకోర్టు న్యాయవాది రామ్ రెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబాద్రి, నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, బాపురెడ్డి, అఖిలపక్ష నాయకులు, భక్తులు, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love