మోబిల్‌వేర్‌ టెక్నాలజీస్‌లో జాగల్‌కు వాటా

Zaggle హైదరాబాద్‌: పేమెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ మోబిల్‌వేర్‌ టెక్నాలజీస్‌లో 38 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నట్టు జాగల్‌ ప్రీపెయిడ్‌ సొల్యూషన్స్‌ వెల్లడించింది. ఈ వాటాను రూ.22.85 కోట్లతో కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. పోస్ట్‌ ఇష్యూ ద్వారా 26 శాతం వాటాను రూ.15.60 కోట్లతో, మరో 12.34 శాతం వాటాను ప్రమోటర్ల నుంచి రూ.7.25 కోట్లతో స్వాధీనం చేసుకున్నట్టు జాగల్‌ ఎండీ, సీఈఓ అవినాష్‌ గొడ్‌ఖింది తెలిపారు.

Spread the love