ఓడలు బండ్లు అవుతాయి… బండ్లు ఓడలు అవుతాయి.. అంటే ఇదేనేమో

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
ఆనాడు ఎమ్మెల్యే పోచారం అన్నమాటలు నేడు నిజమయ్యాయి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరడం అంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో, ఉమ్మడి జిల్లా నిజామాబాదులో లో పరిచయం అక్కరలేని నేత. బాన్సువాడ నియోజకవర్గంలో ఎదురులేని ఎమ్మెల్యే. 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే అందులో ఒకసారి మాత్రమే ఓటమిపాలైన బలమైన నాయకుడు. రాష్ట్రంలో స్పీకర్ గా  మంత్రిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ కురువృద్ధుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకనాడు టిడిపి, టిఆర్ఎస్ లో రాజ్యమేలిన ముఖ్యనాయకుడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బాన్సువాడ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. గెలిచిన అనంతరం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఓ సభా విషయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేశంతో రాజకీయం ఎవరి సొత్తు కాదని రాజకీయంలో ఏమైనా జరగవచ్చునని ఆయన అన్నారు. అందులో భాగమే నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆనాడు అన్నమాటలు నేడు నిజమయ్యాయి ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో,  రాజకీయాలు అంటేనే ఓ సముద్రం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విచిత్ర పరిస్థితి. ఓడలు బండ్లు అవుతాయి… బండ్లు ఓడలు అవుతాయి. అవును ఈ సామెత బాన్సువాడ నియోజకవర్గ  రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. సీనియర్ రాజకీయ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇందుకు ఓ చక్కని ఉదాహరణ. టిడిపి అధినేత చంద్రబాబు నాయడుకు , టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు అత్యంత సన్నిహతుడు కావడంతో ఉమ్మడి  జిల్లాలో ఆయన మాటకు తిరుగులేదు. పార్టీ నుంచి టికెట్ కావాలన్న, రాజకీయంగా ఎదగాలన్న పోచారం ఆశీస్సులు ఉండాల్సిందే. రాష్ట్రంలో స్పీకర్ గా మంత్రిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ కురువృద్ధుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డ ఒకనాడు టిడిపిలో టిఆర్ఎస్ పార్టీలో రాజ్యమేలిన ముఖ్యనాయకుడు.
Spread the love