మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలోని శ్రీహనుమాత్ సహిత శ్రీమద్రాజరాజేశ్వరి పంచాయాతన మందిరంలో బుధవారం శివపార్వతుల కల్యాణం అంగరంవైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం 8.30 గణపతి పూజ ప్రారంభం నుంచి రాత్రి 12 గంటల వరకు శివ కల్యాణం శోభాయాత్ర, అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు లింగోధృవ పూజ,జగరణం నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు.ఇట్టి మహోత్సవానికి చుట్టుపక్కల సందర్శకులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు సకల ఏర్పాట్లు చేశారు.