నాగిరెడ్డిపల్లిలో శివరాజ్ గౌడ్ ప్రచారం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో   భువనగిరి లోక్ సభ  భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గురువారం గ్రామంలో ఇంటిదగ్గ ప్రచార నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలు పనిచేసే వద్ద ప్రచారం నిర్వహించారు. చేయి గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ  ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆదినారాయణ, మండల ఉపాధ్యక్షులు చుక్క స్వామి, మోహన్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కరుణాకర్, సీనియర్ నాయకులు బొక్క శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వాసగోని సాయి గౌడ్, గ్రామ యూత్ అధ్యక్షుడు జమాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్ గౌడ్, బాలకృష్ణ యాదవ్, సురేష్ రెడ్డి, అనిల్ గౌడ్, వంశీ, ఉదయ్, శివమణి గౌడ్ లు పాల్గొన్నారు.
Spread the love