– ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్
బ్యూనస్‌ఎయిర్ (అర్జెంటీనా): ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం దక్కింది. మంగళవారం రాత్రి జరిగిన మహిళల 10మీ. ఎయిర్ పిస్టోల్ విభాగంలో 18ఏళ్ల యువ షట్లర్ సురుచి ఇందర్ సింగ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆమె 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లోనూ సురుచి అదే జోరు కొనసాగించింది. ఆరంభంలో కాస్త వెనుకబడినా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. 8మంది షూటర్ల మధ్య జరిగిన ఫైనల్లో 244.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్,10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీలో రుద్రాంక్ష్ పాటిల్ ఇప్పటికే గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.