షూటర్లు మెరుస్తారా?

Do shooters shine?– బరిలో మనుబాకర్‌, ఈషా సింగ్‌
– నేటి నుంచి షూటింగ్‌ ప్రపంచకప్‌
లిమా (పెరూ) : ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) 2025 ప్రపంచకప్‌ (రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌) రెండో దశ పోటీలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. పెరూ రాజధాని లిమాలోని లాస్‌ పల్మాస్‌ రేంజ్‌లో జరిగే ప్రపంచకప్‌ పోటీల్లో 35 మందితో కూడిన భారత జట్టు పతక వేటలో నిలిచింది. అర్జెంటీనాలో జరిగిన తొలి దశ పోటీల్లో చైనా అగ్రస్థానంలో నిలువగా.. భారత్‌ నాలుగు స్వర్ణాలు సహా ఎనిమిది మెడల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. లిమాలోనూ అదే జోరు కొనసాగించేందుకు చూస్తున్న టీమ్‌ ఇండియా ఈసారి పతకాల సంఖ్యను రెండంకెలకు చేర్చాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. ఒలింపిక్‌ మెడలిస్ట్‌ మను బాకర్‌ భారత షూటింగ్‌ జట్టుకు సారథ్యం వహిస్తోంది. యువ షూటర్‌ సురుచి సింగ్‌తో కలిసి మను బాకర్‌ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో పతక వేట సాగించనుంది. సౌరభ్‌ చౌదరి, వరుణ్‌ తోమర్‌, రవిందర్‌లు మెన్స్‌ విభాగంలో ఎయిర్‌ పిస్టల్‌ మెడల్స్‌పై గురి పెట్టనున్నారు. హైదరాబాద్‌ స్టార్‌ ఈషా సింగ్‌ మహిళల 25మీ స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో పోటీపడనుంది. ఈ విభాగంలో మను బాకర్‌, సిమ్రన్‌జిత్‌ కౌర్‌ సైతం పోటీ పడనున్నారు.

Spread the love