సురక్షితంగా బయటపడిన
ట్రంప్ దంపతులు, మంత్రులు
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల అదుపులో నిందితుడు
వాషింగ్టన్ : అమెరికా శ్వేతసౌధం సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. వాషిం గ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్‌లో జరిగిన వైట్‌హౌస్ పాత్రికేయుల విందు కార్యక్రమ ంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదు. కాల్పులు జరిగిన వెంటనే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్, విదేశాంగ మంత్రి మార్కె రుబియోలను అక్కడి నుంచి హుటాహుటిన తరలించా రు. ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పు లు జరిగాయని ఘటనా స్థలంలో ఉన్న కొందరు వ్యక్తులు తెలిపారు. ప్రాణభయం తో అనేక మంది అతిథులు టేబుల్స్ కింద దాక్కున్నారు. షాట్‌గన్, హ్యాండ్‌గన్‌తో పాటు అనేక కత్తులతో వచ్చిన నిందితుడు భద్రతా వలయాన్ని దాటుకొని లోపలికి ప్రవేశించి హఠాత్తుగా కాల్పులు మొదలు పెట్టాడు. కాగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని, తామంతా క్షేమంగా ఉన్నా మని ట్రంప్ చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా రని తెలిపారు. ఇరాన్‌పై తాము జరుపుతున్న యుద్ధానికి, ఈ దాడికి సంబంధం ఉన్నదని తాను అనుకోవడం లేదని అన్నారు. అయితే ఏదీ చెప్పలేమని వ్యాఖ్యానించారు.
ప్రత్యక్షసాక్షి కథనం ప్రకారం…
కాల్పులు జరిపేందుకు పథకాన్ని రూపొందించుకున్న నిందితుడు హోటల్ లోనే ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. శీతల పానీయాలు ఉంచే గది సమీపంలో పెద్దగా భద్రతా ఏర్పాట్లు ఉండవని తెలుసుకున్న నిందితుడు కోలో టామోస్ అలెన్ అక్కడే దాక్కున్నాడని, ఓ బ్యాగు నుంచి పొడవైన తుపాకీని బయటికి తీశా డని, ఆ తర్వాత ఆకస్మికంగా విందు జరుగుతున్న బాల్ రూమ్ వైపు ఆ తుపాకీ పట్టుకొని పరుగులు తీశాడని వివరించా రు. ఆ వెంటనే విచక్షణా రహితంగా అన్ని వైపులా కాల్పులు జరిపాడని తెలిపారు. దీంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, భద్రతా దళాలు అతనిని పట్టుకునేందుకు పరుగులు తీశారు.
ఉన్నత విద్యావంతుడే కానీ…
డొనాల్డ్ ట్రంప్, ఆయన క్యాబినెట్ సహచరులు హాజరైన విందులో కాల్పుల కు పాల్పడిన నిందితుడు ఒక ఉన్నత విద్యావంతుడని తెలిసింది. దర్యా ప్తు బృందాలు అతనిని కోలో టామోస్ అలెన్‌గా గుర్తించారు. అతను కాలిఫోర్ని యాలోని లాస్ ఏంజెల్స్ శివారులో ఉన్న టోరెన్స్ ప్రాంతానికి చెందిన వాడు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీలో 2017లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చదివాడు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే వీల్‌చైర్స్‌కు అత్యవసర బ్రేకులను ప్రయోగాత్మకంగా తయారు చేసి ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. 2018లో ఓ వీడియో గేమ్‌ను తయారు చేసి ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. ఇటీవలే ‘ఫస్ట్‌లా’ పేరిట ఇంకో వీడియో గేమ్‌ను కూడా రూపొందిం చాడు. 2014లో జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో నాసా నిర్వహించిన ఫెలోషిప్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 డిసెంబరులో టీచర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు కూడా. అతను డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరుడని తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన కమలా హారిస్ ప్రచారానికి పాతిక డాలర్ల విరాళం ఇచ్చాడని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ రికార్డులలో ఉంది. కాగా లాస్ ఏంజెల్స్ శివారులోని టోరెన్స్‌లో అలెన్ నివసిస్తున్న ఇంటి వద్దకు చేరుకున్న ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. పలువురు పాత్రికేయులు కూడా అక్కడికి చేరుకున్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదు వాషింగ్టన్ ఘటనపై ప్రపంచ నేతలు
శ్వేతసౌధం కరస్సాండెంట్ల డిన్నర్ కార్యక్రమంలో జరిగిన కాల్పుల ఘటన నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మంత్రిమండలిలోని కీలక సభ్యులు సురక్షితంగా బయటపడడంపై ప్రపంచ దేశాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని వారు స్పష్టం చేశారు. కాల్పుల ఘటన నుంచి అమెరికా నేతలు క్షేమంగా బయటపడడం తనకు ఊరట కలిగించిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా అమెరికాలో జరిగిన దాడిని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఖండించారు. హింస దేనికీ మార్గం కాదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ అన్నారు. శాంతి విలువలను సమర్ధించే ప్రజలకు హింస ఎన్నటికీ మార్గం కాదని వెనిజులా అధ్యక్షురాలు రోడ్రిగుయెజ్ చెప్పారు. దాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తైవాన్ అధ్యక్షుడు చింగ్ టే తెలిపారు. కాగా అమెరికాలో పార్టీలకు అతీతంగా చట్టసభ సభ్యులందరూ దాడిని ఖండించారు.



