
నవతెలంగాణ – కామారెడ్డి
బాల్య వివాహాలు లేని గ్రామాలుగా, మండలాలుగా తీర్చి దిద్దుటకు వ్యవస్థతో కలిసి పనిచేయాలని కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం సాధన స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బాల్యవివాహాలు తదితర విషయాలపై ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశం లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొనీ మాట్లాడుతూ,బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికుల నిర్మూలన, బాల బాలికల అక్రమ రవాణా,బాల బాలికలపై జరుగుతున్న హింస నిర్మూలన వంటి వాటిపైన గత కొన్ని సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యల పైన వివరించారు. ప్రజలు చట్టాల పైన అవగాహనా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కలిగి ఉండాలనీ, మీకు ఎటువంటి సమస్య ఉన్న సహకరించడానికి మేము ముందుంటామనీ సాధన సంస్థ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన సీఈఓ. మురళీమోహన్, డిసిపిఓ స్రవంతి, కోఆర్డినేటర్ వెంకటేష్, రాజేందర్, నరసింహ, మధుసూదన్, గిరిజ, షీ టీం సౌజన్య, జిల్లాల కమిటీ కోఆర్డినేటర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.