Wednesday, May 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమరిన్ని రంగాల్లోకి శ్రేయాస్‌ గ్రూప్‌ ప్రవేశం

మరిన్ని రంగాల్లోకి శ్రేయాస్‌ గ్రూప్‌ ప్రవేశం

- Advertisement -

10,000 మంది యువతకు ఉపాధి : ఆ సంస్థ అధినేత శ్రీనివాస్‌ రావు వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్‌

శ్రేయాస్‌ గ్రూప్‌ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ యువత కోసం సరికొత్త నమూనాను ప్రకటించింది. మీడియా, ఈవెంట్స్‌, రియల్‌ ఎస్టేట్‌, స్పోర్ట్స్‌ రంగాలలో సుమారు 10,000 మందిని వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ అధినేత గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు. ఎటువంటి పెట్టుబడి లేకుండానే యువత తమ సొంత ప్రాంతాల్లో శ్రేయాస్‌ ప్రతినిధులుగా చేరి, ఒక క్రమబద్ధమైన బిజినెస్‌ మోడల్‌ ద్వారా ఆదాయం పొందే అవకాశాన్ని తమ సంస్థ కల్పిస్తోందన్నారు. దేశంలో గత 15 ఏళ్లలో 5,000కు పైగా ఈవెంట్లు, 2,500 సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం తమకుందని జి.శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేట్‌ ఎంగేజ్‌మెంట్‌, వారాంతపు వ్యవసాయ అనుభవం, గ్రామ పర్యటనలు, సామాజిక వేడుకల వంటివీ నిర్వహిస్తామని.. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో ఔత్సాహిక వాణిజ్యవేత్తలను భాగస్వాములుగా చేసుకుంటామని వివరించారు. ఇప్పుడు ఇతర భాషా చిత్ర పరిశ్రమలతో పాటు రియల్‌ ఎస్టేట్‌, ఏఐ రంగాల్లోకి విస్తరిస్తోందన్నారు. శ్రేయాస్‌ ఫ్యూచర్‌ సిటీ ద్వారా ఖమ్మంలో తొలి ప్రాజెక్టును ప్రారంభించడమే కాకుండా, శ్రేయాస్‌ ఏఐ ఫ్రేమ్స్‌ పేరుతో అత్యాధునిక వీడియో ప్రొడక్షన్‌ స్టూడియోను కూడా అందుబాటులోకి తెస్తోంది. వినూత్నమైన ఎనీ టైమ్‌ థియేటర్‌ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలను సష్టించేందుకు సంస్థ సిద్ధమైందని శ్రీనివాస్‌ రావు పేర్కొన్కారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -