మల్హర్ ఎంపీడీఓ గా శ్యాంసుందర్ 

నవతెలంగాణ – మల్హర్ రావు
త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓలు బదిలీయ్యారు. ఈ క్రమంలో మండల నూతన ఎంపీడీఓలు గా కె.శ్యాంసుందర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన నరసింహామూర్తి బదిలీపై మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన శ్యాంసుందర్ కు మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, సూపర్ డెంట్ శ్రీరామమూర్తి, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడారు మండలాన్ని అభివృద్ధితోపాటు ఆదర్శంగా తీర్చి దిద్దాలని ఎంపీడీఓలు కోరారు.
Spread the love