ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న శ్యాంసుందర్ ముదిరాజ్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 28వ వర్దంతి పురస్కరించుకుని నందమూరి యువసేన రాష్ట్ర నాయకులు దేప శ్యామ్ సుందర్ ముదిరాజ్ తన నివాసం దండు మల్కాపురంలో గురువారం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఔనత్యాన్ని ప్రపంచమంతా చాటిచెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.తెలంగాణ లో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తెచ్చిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు.తెలంగాణలో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చైతన్యవంతులు అయ్యారని పేర్కొన్నారు.పేదల కోసం వృద్ధాప్య పింఛన్ పక్క ఇళ్ల నిర్మాణం రైతులకు ఉచిత విద్యుత్ అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి పేద ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు ఎన్టీఆర్ ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ అన్నారు.ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు మొగిలి రాజు రెడ్డి,నెల్లికంటి శంకరయ్య,సోప్పరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love