పవిత్రతకు మారుపేరు సిద్దుల గుట్ట: జడ్జి పద్మావతి

నవతెలంగాణ – ఆర్మూర్  

పవిత్ర సిద్ధుల గుట్టపై పురాతన కాలములో తొమ్మిది మంది సిద్దులు తపస్సు చేసిన చరిత్ర కలదనీ, అందుకే నవనాథ సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందింది. జిల్లా కోర్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,  కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పి. పద్మావతి అన్నారు. కుటుంభ సభ్యులతో సోమవారం దర్శించుకున్నారు.  పట్టణములోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం సిద్ధుల గుట్టపై నెలకొన్న స్వయంభూ శివలింగం యొక్క ప్రాముఖ్యత, మహత్యం తెలుసుకుని దర్శనానికి వచ్చారు. నవనాథ సిద్దులగుట్టపై వెలసిన స్వయం భూ శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి పురోహితులు కుమార శర్మ నేతృత్వములో ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి . మాట్లాడుతూ పవిత్ర సిద్ధుల గుట్ట మహత్యం చాలా గొప్పది, దర్శనానికి కుటుంభ సభ్యులతో కలిసి వచ్చాము, గుట్టపై అద్భుతంగా ఉందని, చాలా అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. ఈ సందర్బంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యములో న్యాయమూర్తి కి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో సీనియర్ న్యాయవాది,  కోర్టు పి పి శ్రీనివాస్ ఖాందేష్ ,న్యాయ సిబ్బంది, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love