– ఆసియా అండర్-18 అథ్లెటిక్స్
న్యూఢిల్లీ : భారత యువ అథ్లెట్ నితిన్ గుప్తా (17) ఆసియా అండర్-18 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని డామమ్‌లో జరుగుతున్న పోటీల్లో 5000 మీటర్ల రేస్ వాక్‌లో నితిన్ గుప్తా రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 20.21.51 సెకండ్లలో రేస్ వాక్‌ను ముగించిన నితిన్ గుప్తా..సెకన్‌లో 01 వ్యత్యాసంతో పసిడి పతకం చేజార్చుకున్నాడు. చైనా అథ్లెట్ జు పసిడి నెగ్గగా.. చైనీస్ తైపీ అథ్లెట్ షెంగ్ క్విన్ కాంస్య పతకం గెల్చుకున్నాడు.