
తెలంగాణ రాష్ట్రం లోనే తొలిసారిగా కంటిన్యూయస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ (సీఎస్ఈ) నైపుణ్య శిక్షణా తరగతులు ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డితో కలిసి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో అందిస్తున్న ఈ శిక్షణ ఆస్పత్రిలో పని చేసే నర్సులు తమ వృత్తిలో నైపుణ్యం పెంచుకునేందుకు ఇది దోహదపడుతుందని ఆయన తెలిపారు.ఈ నెల 16వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నర్సులు కూడా వారి వృత్తిలో నైపుణ్యత ను అభివృద్ధి చేసు కోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇది తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల విభాగంలో మొదటి సారిగా నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ డాక్టర్ విద్యులత, అడిషనల్ డెరైక్టర్ టి విజయ నిర్మల, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ రాధ రుక్మిణి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, డాక్టర్ పాండు నాయక్, డాక్టర్ శేషాద్రి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుజాత రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.