Tuesday, June 9, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పూరీ జగన్నాథ్ 'స్లమ్ డాగ్' టీజర్..

పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ టీజర్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ దర్శకులు పూరీ జగన్నాథ్ మరో కొత్త సినిమాతో రాబోతున్నారు. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే డిఫరెంట్ టైటిల్ తో అదిరిపోయే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీ దర్శకత్వం వహిస్తుండగా… విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేస్తున్నారు. టబు, సంయుక్త కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. 1.15 నిమిషాల యాక్షన్ ఫ్యాక్ట్ టీజర్.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో వ‌చ్చే.. ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా అనే డైలాగ్స్ ఈ సినిమాకు మంచి ఊపునిచ్చాయి. ఇక ఈ సినిమాను చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తుండగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -