నీట్‌లో మెరిసిన బస్సు కండక్టర్ కొడుకు ..

– బాన్సువాడకు ఆదర్శంగా నిలిచాడు..
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
ఇటీవల నిర్వహించిన 2024 నీట్ అఖిలభారత వైద్య పరిషత్ ప్రవేశ పరీక్షల్లో టీజీఎస్ ఆర్టీసీ బాన్సువాడ డిపో కండక్టర్ గురుడు అంబాజీ కుమారుడు గురుడు సాయి కార్తీక్ నీట్ పరీక్షలో 547 మార్కులు సాధించాడు. 720 మార్కులకు  గాను సాయి కార్తీక్ 547 మార్కులు సాధించాడు. సాయి కార్తీక్  బాన్సువాడ  మండలం కొత్తబాది ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో పాఠశాల విద్యను మరియు హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన  అంబాజీ, పద్మావతి దంపతుల ఏకైక కుమారుడు సాయి. బాన్సువాడలో  తండ్రి బస్సు కండక్టర్ గాను విరామ సమయంలో బాన్సువాడ పట్టణంలో నాయీ బ్రాహ్మణ మంగళి వృత్తి చేస్తూ కుమారున్ని చదివించారు. ఈ సంవత్సరం  నీట్ పరీక్ష లో ఉత్తీర్ణత పొంది  బాన్సువాడ పట్టణంలో ఆదర్శంగా నిలిచాడు. పలువురు విద్యార్థికి  సన్మానిస్టు అభినందించారు. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన నీట్ మెడికల్ పరీక్ష ను ఉత్తీర్ణత అవ్వడం అంతా తేలికైనా పని కాదు. విద్యార్థి సాదించగలను అనే దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు. తండ్రికి తోడుగా నాయీ బ్రాహ్మణ మంగళి వృత్తి చేస్తూ నీట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి అందరీకి ఆదర్శంగా నిలిచాడు.
Spread the love