ఆడవారికి అంతులేని
గౌరవాన్ని ఇస్తుందని
చెప్పుకునే నా దేశం
తల్లుల ఔనాత్యాని నగంగా
నాగరికత మీద ఊరేగిస్తున్నది
భినత్వంలో ఏకత్వం
అని గుండెను
చిల్చుకొని చెప్పుకొని నా దేశం
బలహీనమైన ఎదల మీద
ఉచ్చపోసి గర్విస్తున్నది
ఇక్కడ
అన్యాయానికి అంటురోగంలా
అధికారముంటుంది
మౌనం, మత మౌడ్యపు
కూడ్యం కడుతూ కుట్ర పన్నుతుంది
స్పందనకు కాసింత
సమయం కావాలి
చెల్లుబాటు కానీ చిల్లర నోటుల
చైతన్యం ఇప్పుడు చిత్తు కాగితమే
నిరసనలు, నినాదాలు, నివాళులు
విరామం లేని వరుసక్రమాలు
సారీ టు సే
మనుషులంతా
వేరు చేయబడ్డారు
మేమంతా ఒక్కటే అని
అందమైన అబద్ధాలతో
అధికారాలు చేయండి.
– పి. సుష్మ