Saturday, May 23, 2026
E-PAPER
Homeఖమ్మంఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిని పరిశీలించారు. గత సంవత్సరం ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మండలంలోని పాత రెడ్డిగూడెం గ్రామపంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి 100 శాతం ఇండ్ల మంజూరు జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొన్ని కుటుంబాలు అనివార్య కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించకపోవడం, మరికొన్ని చోట్ల పనులు అసంపూర్తిగా ఉండటం, ఇంకొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు నెమ్మదిగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకుని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద కుటుంబ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అధికారులు కూడా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సహకరించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, స్థానిక సర్పంచ్ , పాలకవర్గం సభ్యులు,కాంగ్రెస్ మండల తాజా మాజీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,తుమ్మ రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -