రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శుక్రవారం చిత్ర బృందం మూడవ సింగిల్ ‘హల్లల్ల ల్లో’ ప్రోమోను విడుదల చేసింది. ఈ పాటలో రామ్ చరణ్ తన రగ్డ్, స్టైలిష్ లుక్‌లో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఆయనతో పాటు శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ కూడా అలరించారు. శ్రుతి హాసన్ తన బోల్డ్ అటిట్యూడ్‌తో, జాన్వీ కపూర్ తన గ్రేస్‌ఫుల్ ఎనర్జీతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ పాటను మరింత గ్రాండ్‌గా మార్చింది. పూర్తి పాటను నేడు (శనివారం) భోపాల్‌లో జరగనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్, ఆయన బృందం ఈ పాటను ప్రత్యక్షంగా ప్రదర్శించనుండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. జూన్ 4న ఈ సినిమా విడుదల కానుండగా, జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు.
స్పెషల్ మాస్ సాంగ్ ‘హల్లల్ల ల్లో’
- Advertisement -
- Advertisement -



