జీ5 లో మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్’ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు మహేష్ నారాయయణన్ దీన్ని తెరకెక్కిం చారు. 18 ఏళ్ల తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ చిత్రంలో కలిసి నటించారు. నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్‌చాకో బొబన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు మహేష్ నారాయణన్ మాట్లాడుతూ, ‘మన ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ప్రజలను రక్షించడానికి రూపొందించిన టెక్నాలజీనే చివరకు భయం, నియంత్రణకు ఆయుధంగా మారే పరిస్థితులను ఈ సినిమాలో చూపించాంఅని తెలిపారు. 'ఈ మూవీ ఎంతో ప్రత్యేకమైన సినిమా. భారీ రేంజ్‌లో చేసిన మూవీ. రాజకీయ ఉత్కంఠ అనే అంశం మాత్రమే కాకుండా.. ఇది మనస్సాక్షి, బాధ్యత, ధైర్యం గురించి చెప్పే బలమైన మానవీయ కథ. ఈ సినిమా కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతూనే భావోద్వేగాలకు కనెక్ట్ అవుతుంటుంది అని మమ్ముట్టి చెప్పారు. మోహన్ లాల్ మాట్లాడుతూ,’ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచం గురించి మాట్లాడే సినిమా. నిజం, అధికారం మధ్య జరిగే నిరంతర సంఘర్షణను ఆవిష్కరిస్తుంది` అని చెప్పారు.
నిజం, అధికారం మధ్య సంఘర్షణ
- Advertisement -
- Advertisement -



