దుర్గామాత గుడిలో ప్రత్యేక పూజలు

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్: 
యాదగిరి గుట్ట మండలం రామాజీపేట గ్రామంలో మంగళవారం, కాంగ్రెస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా గెలవాలని దుర్గామాత గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కరపత్రాలు గడపగడపకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాజీపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్ధులు, ఉపాధ్యక్షులు మొగిలిపాక నరేష్, యూత్ అధ్యక్షులు మొగిలిపాక కృష్ణస్వామి, మాజీ ఉపసర్పంచ్ శంకర్, సీనియర్ నాయకులు నమిలే కేశవులు, శ్రీశైలం, కల్లూరు భాస్కర్ రెడ్డి, స్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love