నవతెలంగాణ-ఆలేరు టౌన్
నార్సింగి పరిధిలోని మంచిరేవుల మాచిలేశ్వర్ శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తన సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్మన్, బీర్ల అనితతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, బీర్ల అనిత దంపతులకి ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య దంపతులు స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
వీరభద్రస్వామి ఆలయంలో బీర్ల దంపతుల ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


