- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు 50 సంవత్సరాల నుండి వైద్య సేవలను అందించినందుకు, ఆలేరు పట్టణంలో సోమవారం వైద్య పండిత అవార్డు గ్రహీత డాక్టర్ చింతకింది మురహరికి, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, మురళి క్లినిక్ ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, శాలువాతో ఘన సన్మానం చేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కూతాటి అంజన్ కుమార్, మోతె వెంకటేష్, వైద్య సిబ్బంది భార్గవి, కళ్యాణి, అనూష తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



