– యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని ఆదేశం
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం భావించింది. ప్రతి పల్లెను పరిశుభ్రంగా మార్చలన్న లక్ష్యంతో బుధవారం నుంచి ఈ నెల 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది.సర్పంచ్ ల పదవీకాలం పూర్తవడంతో ఈనెల 2నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది.15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణకు నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో మహిళ,యువత,స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవే: మండలంలో మొత్తం15 గ్రామపంచాయితీల్లో 72 మంది మల్టీ పర్పస్ కార్మికులు ఉన్నారు. వీరితోపాటు పంచాయతీ కార్యదర్శులు,ప్రత్యేక అధికారులు గ్రామాల్లో సమస్యలు గుర్తించి, ప్రణాళికలు రూపొందించాలి. ప్రతిరోజూ గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేసి, డ్రైనేజీల్లో పూడిక తీయాలి. మురికి నీరు నిల్వలు ఉంచకుండా చర్యలు తీసుకోవాలి. విధుల్లో రోడ్లపై గుంతలు పూడ్చాలి. పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు,మార్కెట్, బస్సు షెల్టర్లు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయాలి. ఖాళీగా ఉన్న ప్లాట్స్ లో నీటిని తొలగించాలి.శితిలావస్థలో ఉన్న ఇండ్లు,భవనాలు కూల్చివేయాలి.నిరుపయోగంగా ఉన్న బావులు,బోర్ బావులను పూడ్చాలి. మురికి కాల్వల్లో మురికి నీళ్లు నిల్వగా ఉండే ప్రాంతాల్లో దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ వేయాలి. విధుల్లో దోమల మందు స్ప్రే చేయాలి. శుక్రవారం డ్రై దేగా పాటించి ఇళ్లలో నిల్వగా ఉన్న నీటిని తొలగించాలి. పరిసరాలను శుభ్రం చేయాలి.