అమీర్‌పేట్‌ సిక్కు సమాజ్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

– బిఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌
దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను ప ణంగా పెట్టి ఎదురొడ్డి పోరాడే సైనికులలో అత్యధికులు సిక్కు లేనని మంత్రి తలసాని శ్రీని వాస్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం అమీర్‌ పేట లోని ఆదిత్య హౌటల్‌ లో అమీర్‌ పేట సి క్కు సమాజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా మిలన్‌ (ఆత్మీయ సమావేశం) లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు సిక్కు సమాజ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో కషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కే తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అభివద్ధి అంటే తలసాని,తలసాని అంటే అభివద్ధి అని, సనత్‌ నగర్‌ నియోజకవర్గాన్ని ఎంతో అభివద్ధి చేసి నిరూపించారని ప్రశంసించారు. ఏ సమయంలో నైనా ఎలాంటి అవసరమున్నా అండగా నిలిచే గొప్ప నాయకుడు తలసాని శ్రీని వాస్‌ యాదవ్‌ అని కొనియాడారు. అలాంటి నాయకుడు తమకు ఉండటం మా అదష్టమని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో సిక్కు సమాజ్‌ మొత్తం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారి వెంటే ఉంటుందని ఏకగ్రీవంగా ప్రకటిం చారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీని వాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ, తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో అనేక అభివద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివద్ధిని 10 సంవత్స రాలలో చేశా మని వివరించారు. ప్రచారంలో ప్రజలు చూపి స్తున్న ఆదరణ చూస్తుంటే లక్ష మెజార్టీ తో గెలుస్తాననే నమ్మకం తనకున్నదని మంత్రి శ్రీని వాస్‌ యాదవ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మా జీ కార్పొరేటర్‌ నామన శేషుకుమారి, గురుద్వార్‌ అద్యక్షులు బాగిందర్‌ సింగ్‌, మాజీ మైనార్టీ కమిషన్‌ సభ్యులు సురేందర్‌ సింగ్‌, దర్శన్‌ సింగ్‌, అజ్జి సింగ్‌, నరేందర్‌ సింగ్‌, లాహౌర్‌ సింగ్‌, టిల్లు సింగ్‌, ఆనంజిత్‌ కౌర్‌, గురుదీప్‌ సింగ్‌, సుమిత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love