క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

– ఎస్సై ఆంజనేయులు
నవతెలంగాణ –  కోనరావుపేట
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్సై  ఆంజనేయులు అన్నారు. ఆదివారం  మండలంలోని  వట్టి మల్ల గ్రామంలో సంక్రాంతి పండగను పురస్కరించుకుని గ్రామములోని పోలీస్ మిత్రుల సహకారం తో  మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎస్సై మాట్లాడుతూ క్రీడలు యువతకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా క్రీడా రంగంలో ఉన్నత శిఖరాలను చేరాలని అన్నారు. ఈ మండల స్థాయి పోటీలో 12 జట్లు ఆడగా అందులో మామిడిపల్లి జట్టు ఉత్తమ ప్రతిమ కనబరిచి ఫస్ట్ ప్రజ్ రూ.3016-/లు కప్ గెలుచుకుంది. రెండో ప్లేస్ లో వట్టిమల్ల నిలువగా రూ.2016-/  కప్ గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము స్వప్న – దేవరజ్,లైవ్ అధ్యక్షుడు బానోవత్ నరేష్ నాయక్, బృందం గణేష్  గంగారం  ఆలయ చైర్మన్ గుండా వెంకటేష్,లక్కం విజయ్,లక్కమ్ వంశీ కృష్ణ,గండి నరేష్,వడ్నాల స్రిజన్,పాల్గొన్నారు.
Spread the love