మృతదేహాన్ని సందర్శించి పరిశీలిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం

– మద్యం,గుడుంబాకు బానిసై యువత ప్రాణాలు కోల్పోతున్నారు
– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్*
నవతెలంగాణ – మంథని 
గ్రామాలలో మద్యo, గుడుంబాకు బానిసై యువత ప్రాణాలు కోల్పోతున్నారు అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఆరోపించారు. శనివారం మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన మాటేటి (కుసుమ) రాజేందర్ మద్యం మత్తులో నిద్రపోతున్న రాత్రి సమయంలో పాము కాటు వేసి ప్రాణాలు కోల్పోవడంతో రాజేందర్ మృతదేహాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ సందర్శించి పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో విచ్చల విడిగా గుడుంబా,మద్యం దొరకడంతో యువకులు మత్తు పానీయాలకు బానిసై యువత ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.మాటేటి (కుసుమ)రాజేందర్ వృత్తి (కూలి) బాల్యం నుండే నాటుసారకు బానిస అయ్యాడని,తల్లిని కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడన్నారు.కూలి ద్వారా వచ్చే డబ్బులన్ని నాటుసార మద్యానికి వెచ్చించేవాడని ఆయన అన్నారు.మంథనిలోని అన్ని గ్రామాలలోమద్యం ఎరులై పారుతుందని,మద్యాన్ని నియంత్రించడంలో సంబంధిత అధికారులు ఘోర వైఫల్యం చెందారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అబ్కారి శాఖ అసలు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులే లేవని,ఒక సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారానికి ఇటీవల కాలంలో సమాధానం చెప్పడం విడ్డురమాని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 1లక్ష10 వేల బెల్ట్ షాపులు నడుస్తున్నాయని అన్నారు.ఈ మధ్యకాలంలోనే బట్టుపల్లి గ్రామంలో మద్యానికి బానిసైన మానవ మృగం కన్న కూతురినే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన సంఘటన అందరి హృదయాలను కలచివేసిందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పచ్చని పల్లెల్లో నాటు సారా,మద్యం, మత్తు,పదార్థాలు విచ్చలవిడిగాదొరకడం వలన పల్లెల్లోపచ్చని కాపురాలు,యువత భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాలలో నడుస్తున్న మద్యం,నాటుసారా,మత్తు పదార్థాలు నియంత్రించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని గ్రామ సీమలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Spread the love