వైన్ షాపుల నుండి నేరుగా తరలిపోతున్న మద్యం

– బెల్టు షాపులతో బెంబేలెత్తుతున్న జనం
– బెల్టు షాపులకే నేరుగా మద్యం సరఫరా.
– వీధి వీధికో బెల్టు షాప్
– మత్తులో జోగుతున్నయ యువత
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మంథని: మంథని పట్టణ ప్రాంతంతో పాటు మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయాలు కొనసాగిస్తున్న వారిని అడిగే నాధుడే కరువయ్యారు.చాప కింద నీరు వలే యువత భవిష్యత్తు మత్తులోకి వెళుతుంది.వీధి వీధికో బెల్ట్ షాపు ఏర్పాటు చేయడంతో భవిష్యత్తు భావి యువత జీవితం అంధకారంలోకి వెళ్తుంది. పోటీపడి మరి బెల్టు షాపులను మంథని మండలంలో ప్రారంభించడం జరుగుతుంది.బెల్టు షాపు దుకాణాల్లో ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్ముకోవడం పరిపాటిగా మారింది.వైన్ షాపుల యజమానులు కుమ్మక్కై,సిండికేట్ గామారి గుట్టు చప్పుడుగా మద్యాన్ని వివిధ వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.మంథని మండలంలో గ్రామ గ్రామానికి మూడేసి, నాలుగేసి బెల్ట్ షాపులు నడుస్తుండడం గమనర్వం.కొన్ని గ్రామాల్లో బహిరంగంగా వేలంపాట ద్వారా బెల్ట్ షాపులు చేజిక్కించుకున్న బెల్ట్ షాపుల యజమానులు మధ్యం ప్రియుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు.బెల్ట్ షాపులలో అధిక ధరకు మద్యం అమ్మడంవంటి కార్యక్రమాలు గ్రామీణంలో కోకోల్లోలుగా జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పోటీపడి మరి బెల్టు షాపులు గ్రామాల్లో పుట్టగొడుగుల్లావెలుస్తున్నాయి.గ్రామాల్లో బహిరంగంగా వేలంపాట ద్వారా బెల్ట్ షాపులు చేజిక్కించుకున్న బెల్ట్ షాపుల యజమానులు మద్యం ప్రియుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు.బెల్ట్ షాపులపై కొరడా జులుపించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో గ్రామాలలో బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయి.గ్రామాలలోని ఏ గల్లి గల్లిన చూసిన బెల్టు షాపులు,కిరాణం షాపుల్లో దర్శనమిస్తాయి.బెల్టు షాపుల్లో అధిక ధరకు మద్యం విక్రయించడం ద్వారా అప్పుచేసి మరి యువత మద్యం కొనుగోలు చేయడంతో యువత మానసికంగా,ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు.దీనికి తోడు మద్యానికి బానిసైన మద్యం ప్రియులు కుటుంబంలో గొడవలు పడిన సంఘటనలు దర్శనమిస్తాయి. ఇటీవల బట్టుపల్లి గ్రామంలో తన కన్న కూతురిని మద్యం మత్తులో నరికి చంపిన సంఘటనలు ఉన్నాయి.అధిక మద్యం బాటిల్లు విక్రయించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ వైన్ షాప్ నిర్వాహకులు బెల్ట్ షాప్ లకు మాత్రం యదేచ్చగా మద్యం అమ్ముతున్నారు. మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో బెల్ట్ షాపులకు కాసుల వర్షం కురిపిస్తుంది.బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై దాడులు జరుపుతున్న పోలీసులు,వారి కళ్ళముందే నడుస్తున్న బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించకపోవడం సర్వాత్ర విమర్శలకు తావిస్తోంది.మరోపక్క గ్రామాల్లో నాటు సారా,మద్యం,24 గంటలు ఏరులై పారడంతో మద్యం ప్రియుల జేబులు,కుటుంబాలు గుల్లవుతున్నాయి.పొద్దు మాపు,పగలు రాత్రి,అనే తేడా లేకుండా 24X7 గంటలు బెల్ట్ షాపులు నడవడం వల్ల బెల్టు షాపులలో మద్యం లభించడంతో గ్రామాలలో వేకువ జాముననే మద్యం కోడై కూస్తుంది.యువతతో పాటు పలు కుటుంబాలు మధ్యనికి బానిసై చిన్న భిన్నం అవుతున్నాయి.దీనికి తోడు వైన్ షాపుల పక్కన సిట్టింగ్ రూములు ఏర్పాటు చేసుకుని మద్యం ప్రియుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సగటు యువత కోరుతుంది.మంథని పట్టణంలోని పలు మద్యం షాపుల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వైన్ షాపుల నిర్వాహకుల అండతో బెల్ట్ షాపుల్లోకి మాత్రం విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కొనసాగుతున్న ఇటు ఎక్సైజ్ అటు పోలీస్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు గ్రామాల ప్రజల ఆరోపణలున్నాయి. అంతేకాకుండా మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ ధరకు మద్యం విక్రయించకుండా అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి నకిలీ మద్యం విక్రయాలు, బెల్ట్ షాప్ లపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Spread the love