క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి ఉపయోగపడతాయి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో డీపైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఆధ్వర్యంలో సంక్రాంతి  క్రీడోత్సవాల్లో భాగంగా ఆదివారం వాలీబాల్ పోటీలను ప్రారంభించి, సీఐ దేవేందర్ మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. నేటి తరం యువకులు అనేక దుర అలవాట్లకు బానిసలై పెడదారిన పడుతున్నారని అన్నారు. స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో మూగజీవులుగా బతుకుతున్నారని అన్నారు. ఇలాంటి తరుణంలో గత 34 సంవత్సరాలుగా యువతీ యువకులలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నంలో డివైఎఫ్ఐ ముందంజలో ఉందని అన్నారు. ఈ క్రీడలను యువతి యువకులు ఉపయోగించుకోవాలని చెప్పారు. డీపైఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సిఐ ఎస్. దేవేందర్ ను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా డివైఎఫ్ఐ యాదాద్రిభువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి క్రీడలకు, క్రీడాకారులకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి, గ్రామీణ స్థాయి క్రీడలకు పెద్దపీట వేయాలని, బడ్జెట్లో క్రీడలకి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని, గ్రామాలలో ఏర్పాటుచేసిన క్రీడా మైదానాలలో క్రీడా సామాగ్రిని క్రీడాకారులకు క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ గీత కార్మికు సంఘం జిల్లా అధ్యక్షులు రాగిరు కిష్టయ్య ,నాయకులు బొడిగె లింగస్వామి,పొట్ట శ్రీనివాస్ క్రీడోత్సవాల కన్వీనర్ తుపాకుల సాయి,దొడ్డి లింగ స్వామి,పాలమాకుల రాకేష్,బోదాస్ నరేష్,అన్నం రాముడు,పొట్ట సుందర్,మాధగోని బాపూజీ,రాగిరు నవీన్,మాధగోని లింగస్వామి,తలాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love