క్రీడా పాఠశాలలో ప్రవేశాలు..

– తాడ్వాయి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సెలక్షన్
– మండల విద్యాశాఖ అధికారి సాంబయ్య, ఎంపీడీవో సుమన వాణి 
నవతెలంగాణ – తాడ్వాయి
జిల్లా యువజన, క్రీడల శాఖ ములుగు జిల్లా వారి ఉత్తర్వుల ఆదేశానుసారం మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో చదువుతున్నట్టి విద్యార్థినీ విద్యార్థులకు హకీంపేట్, కరీంనగర్ ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలలో అడ్మిషన్స్ కొరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో స్పోర్ట్స్ సెలక్షన్ నిర్వహించినట్లు ఎంఈఓ యాప సాంబయ్య, ఎంపీడీవో సుమన వాణిలు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రభుత్వ ప్రయివేటు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 24వ తేదీన సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈవెంట్స్ (బ్యాటరీ టెస్ట్)లు నిర్వహించనున్నట్లు తెలిపారు. 800 మీటర్స్ పరుగు పందెం, షటిల్ రన్ 6/10, స్టాండింగ్ బ్రాండ్ జంప్, వర్టికల్ జంప్, ప్లెక్సీబిలిటీ, ఎత్తు బరువు,  మెడిసిన్ బాల్ (1 కేజీ), 30 మీటర్ల  ప్లేయింగ్ స్టార్ట్ లు పైన తెలిపిన ఈవెంట్స్ అన్నీ పూర్తిచేసి నా విద్యార్థులకు పది పాయింట్లు సాధించిన వారిని జిల్లా స్థాయి సెలక్షన్ కు, జిల్లాస్థాయి సెలక్షన్లో 10 పాయింట్లు సంపాదించిన విద్యార్థులను రాష్ట్రస్థాయి సెలక్షన్ పంపించడం జరుగుతుందని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ పొందడానికి ఆసక్తిగల విద్యార్థులు అందరూ హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Spread the love