Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్స్

మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్స్

- Advertisement -

ప్రిన్సిపాల్ పూర్ణచందర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం ఎడ్లపల్లి గ్రామపరిదిలోగల జంగిడిపల్లి మోడల్ స్కూల్లో 6వ తరగతి నుండి ఇంటర్ రెండవ సంవత్సరం వరకు మిగిలి ఉన్న సీట్లను పూరించడానికి స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల విద్యార్థిని,విద్యార్థులు తమ టిసి,స్టడీ సర్టిఫికెట్ తో వచ్చి సోమ,మంగళవారాల్లో అడ్మిషన్ తీసుకోవాలన్నారు.

మండలంలోని నలు దిక్కుల గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం ఉందని,9వ తరగతి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు అమ్మాయిలకు హాస్టల్ వసతి,ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యానందించడం జరుగుతుందన్నారు.పాఠశాలలో సిసి కెమెరాల పర్యవేక్షణ,అనుభవం,అంకితభావం కలిగిన  ఉపాధ్యాయులచే చదువు,క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు,విద్యార్థిని విద్యార్థులకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -