మూడు ఉద్యోగాలు సాధించిన గృహిణి స్రవంతి

నవతెలంగాణ – ఆర్మూర్  

మున్సిపల్ పరిధిలోని కోటార్ముర్ కు  చెందిన గృహిణి మామిడి స్రవంతి మూడు ఉద్యోగాలను సాధించింది. సుమారు 10 సంవత్సరాల క్రితం జి.స్రవంతికి కోటార్ మూర్ కు చెందిన మామిడి రవి తో వివాహమైంది. కుటుంబంలో ఇంటి పనులు చక్క బెడుతూ, ఆమెకు కలిగిన ఇద్దరు కుమారులను పాఠశాలకు ప్రతినిత్యం తయారు  చేసి పంపిస్తూ.. ఉద్యోగం సంపాదించడం కోసం ఉన్న కొద్దిపాటి సమయంలో ఆర్మూర్ లోని లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ చేసింది. మోర్తాడ్ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ, కుటుంబంలో గృహిణిగా పనులు చక్క బెడుతూ కోటార్ మూర్ కు చెందిన జి.స్రవంతి మూడు ఉద్యోగాలను సాధించింది. గురుకుల సోషల్ వెల్ఫేర్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పి జి టి), జే యల్, ట్రేనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టి జి టి) గా మూడు ఉద్యోగాలకు జి. స్రవంతి ఎంపికైన చివరకు గురుకుల సోషల్ వెల్ఫేర్ లో టీజీటీ ఉద్యోగానికి ఎంపిక అయింది. గృహిణిగా ఉంటూ, ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూస్తూ మూడు ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల . పట్టణంలోని ప్రముఖులు, సన్నిహితులు స్నేహితులు అభినందన లు  తెలిపినారు.
Spread the love