శ్రీజ, మనిక ఔట్‌

శ్రీజ, మనిక ఔట్‌– ఐటీటీఎఫ్‌ వరల్డ్‌కప్‌ 2024
మకావు : టేబుల్‌ టెన్నిస్‌ ప్రపంచకప్‌లో భారత ప్యాడ్లర్లు శ్రీజ ఆకుల, మనిక బత్ర గ్రూప్‌ దశ నుంచి నిష్క్రమించారు. వరల్డ్‌ నం.39 ఆకుల శ్రీజ 1-3తో రెండో మ్యాచ్‌లో ఓడింది. 4-11, 4-11, 15-13, 2-11తో వరల్డ్‌ నం.4 చెన్‌ మెంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. తొలి మ్యాచ్‌లో 4-0తో నెగ్గిన శ్రీజ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్‌ నం.37 మనిక బత్ర 0-4తో నిరాశపరిచింది. 6-11, 4-11, 9-11, 4-11తో వరల్డ్‌ నం.2 వాంగ్‌కు తలొంచింది. మనిక సైతం గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో 16 గ్రూపులు ఉండగా.. గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిస్తేనే నాకౌట్‌ దశకు చేరుకుంటారు. a

Spread the love