గడపగడపకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తున్న శ్రీనివాస్..

బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలి..
వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
త్వరలో జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చరమ గీతం  పాడుతారని ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని సాయినగర్,బోనలవాడ,కొరుట్ల బస్ స్టాండ్ ఏరియాల్లో నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కార్యక్రమంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత,బడుగు,పేద,బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని,కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజల అబివృద్ది,సంక్షేమం జరిగుతుందని విశ్వసిస్తున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కలగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రైతుబరోసా కింద ఏడాదికి ఎకరానికి రూ.15000, మహిళలకు రూ. 2500, రూ. 500 కు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, వరి ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు క్వింటాలకు రూ. 500 బోనస్, రైతు కూలీ కింద రూ. 12000 ఇవ్వడం జరుగుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Spread the love