పలు శుభకార్యాలకు హాజరైన శ్రీనుబాబు

– నూతన వధూవరులకు ఆశీర్వాదం
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు బుధవారం మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో సింగిల్ విండో డైరెక్టర్ బానోతు సమ్మక్క కిషన్ నాయక్ కుమారుడు వివాహానికి, కిషన్ రావుపల్లిలో బొంతల రాకేష్ యాదవ్, పెద్దతూoడ్లలో పింగళి సుస్మిత వివాహ ముస్తాబులు, వళ్లెంకుంట గ్రామంలో వేల్పుల రఘుశృతి దంపతుల కుమార్తె కర్ణవేదన తదితరులు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, జిల్లా  మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాజు నాయక్,కాంగ్రెస్ నాయకులు చొప్పరి సదానందం,అయిత రాజిరెడ్డి, రాజు నాయక్ పాల్గొన్నారు.
Spread the love