నవతెలంగాణ – పెద్దవంగర: మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై ఉపేందర్ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక కు 9 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ కేసుల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించేలా చూస్తాం అన్నారు. అసాంఘిక శక్తుల ఆటలు సాగనివ్వమని పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నూతన చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళా జాతర బృందాలతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అన్నారు. ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానిత వ్యక్తుల సమాచారం తెలిపేందుకు ప్రజలు 100 ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.