రేపు నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం 

– ఇన్ టైంలో పరీక్షలకు హాజరు కావాలి
– ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ చార్జ్ ప్రిన్సిపల్  సిహెచ్ తిరుపతి
నవతెలంగాణ జమ్మికుంట
నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ప్రతి విద్యార్థి ఇన్ టైములో పరీక్షలకు హాజరుకావాలని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ పరీక్షల చీఫ్ సూపర్డెంట్ సిహెచ్ తిరుపతి అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మికుంట పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్లు మూడు ఉన్నాయన్నారు. గవర్నమెంట్ జూనియర్ కళాశాల లో 257 మంది విద్యార్థులు, స్రవంతి జూనియర్ కళాశాలలో 201, కాకతీయ జూనియర్ కళాశాలలో 307 మంది విద్యార్థులు నేడు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి సన్నద్ధం అయ్యారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయన్నారు. ఈ మూడు సెంటర్లలో సీసీ కెమెరా ల పర్యవేక్షణలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు అని తెలిపారు. మొత్తం ఇన్విజిలేటర్లు 30 మంది ఉన్నారని ఆయన తెలిపారు. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల తర్వాత వచ్చిన వారికి పరీక్షకు అనుమతి ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష సెంటర్ల దగ్గర్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదని ఆయన అన్నారు.
Spread the love