పాఠశాలలు ను సందర్శించిన రాష్ట్ర పరిశీలకులు…

నవతెలంగాణ – అశ్వారావుపేట 

మండలంలోని నారాయణపురం,నందమూరి నగర్ ప్రాథమిక పాఠశాలలను ఎస్.సీ.ఇ.ఆర్.టి బృంద గురువారం సందర్శించారు.ఇందులో తొలిమెట్టు నిర్వహణ తీరు, ఉపాధ్యాయులు బోధనా పద్ధతి,విద్యార్ధుల అభ్యసనం సామర్ధ్యాలను పరిశీలించారు.టి.ఎల్.ఎం వినియోగం, తరగతి గది బోధనా తీరు పరిశీలించి తొలిమెట్టు నిర్వహణ లో ఎదురవుతున్న సమస్యలను గురించి ఉపాధ్యాయులు ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం దమ్మపేట(4),అశ్వారావుపేట(2) మండలాల్లో పాఠశాలలను సందర్శించాము అని కొన్ని చోట్ల మార్పులు చేసుకోవాల్సి ఉందని అన్నారు. నందమూరి నగర్ పాఠశాల ఉపాద్యాయులు మల్లికార్జునరావు పనితీరు ప్రశంసనీయంగా ఉందని,ఇక్కడి విద్యార్థుల సామర్థ్యాలు అనుకున్న విధంగా సాధించారని అన్నారు.ఒక్కరే ఉన్నప్పటికీ చక్కగా కృషి చేస్తున్నారని అభినందించారు.రాష్ట్ర పరిశీలకులు కార్తీక్,మురళి లతో పాటు తొలిమెట్టు మండల నోడల్ అధికారి ప్రసాదరావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు హరిత, సి.ఆర్.పి ప్రభాకర చార్యులు పాల్గొన్నారు.
Spread the love